ATP: గుంతకల్ నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధికి రూ. 90 లక్షల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని తిమ్మాపురం శివాలయానికి, నల్లదాసరపల్లి, చింతలంపల్లి, దోసలోడికి సుంకులమ్మ దేవాలయాలకు, పామిడి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం, ఓబులాపురం ఆంజనేయస్వామి దేవాలయాలకు ఈ నిధులు మంజూరైనట్లు వెల్లడించారు.