అన్నమయ్య: మదనపల్లె కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయనుండడంతో సీఎం చంద్రబాబుకు మదనపల్లె జిల్లా సాధన సమితి సభ్యుడు రాటకొండ గురు ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం సాయంత్రం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబును గురు ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో 27వ జిల్లాగా ఏర్పాటు కానున్న మదనపల్లె అభివృద్ధికి ప్రభుత్వం సహాయ, సహకారాలు అందించాలని కోరారు.