VZM: రాష్ట్ర ఐటి, విద్యా శాఖా మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో చిన్నతరహా పరిశ్రమలు శాఖ మంత్రి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం భేటీ అయ్యారు. విశాఖ పర్యటనకు వచ్చిన నారా లోకేష్‌ను విమానాశ్రయంలో మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడ విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ఉన్నారు.