అన్నమయ్య: రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేల్ మండలం కె.కందులవారిపల్లి పంచాయతీలోని గాంధీనగర్ గ్రామంలో నూతన ఆర్ఓ వాటర్ ప్లాంట్ నిర్మాణానికి సోమవారం భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ ముక్కా రూపానంద రెడ్డి, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పాల్గొన్నారు. గ్రామ ప్రజలకు శుద్ధమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా దీన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు.