ప్రకాశం: సంతనూతలపాడులోని పెద్ద చెరువు కట్ట వాటర్ ప్లాంట్ సమీపంలో సోమవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో స్కూటీ దగ్ధమైంది. వాహనదారుడు పాల ప్యాకెట్లు తీసుకువస్తుండగా వాహనం బాగా వేడెక్కడంతో కొద్దిసేపు వాహనం ఆపినట్లు తెలిపాడు. ఇంతలోనే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు ఎగసిపడి ప్రమాదం జరిగిందని స్కూటీ యజమాని వెల్లడించాడు.