KRNL: ఆదోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ప్రాంగణం భారీ వర్షానికి జలమయం అయింది. రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ప్రజలు నీటిలో నడుస్తూ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కార్యాలయ రహదారి మురికినీటితో నిండిపోవడంతో వాహనాలు నిలిచిపోయాయి. తక్షణమే రహదారి సమస్యకు పరిష్కారం చూపాలని అధికారులు, ప్రజాప్రతినిధులను స్థానికులు డిమాండ్ చేశారు.