ELR: ఉంగుటూరు మండలం కాగుపాడు గ్రామంలోని పంట పొలంను దమ్ము చేస్తుండగా పవర్ టిల్లర్ (ట్రాక్టర్) తిరగబడి కౌలు రైతు శ్రీనివాసరావు మృతి చెందారు. కాగుపాడు గ్రామానికి చెందిన శ్రీనివాసరావు అదే గ్రామంలో కౌలుకి వ్యవసాయం చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం పవర్ టిల్లర్ సాయంతో దమ్ము చేస్తుండగా తిరగబడి దాని కింద పడి మృతి చెందారు.