ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి మేకతోటి సుచరిత పార్టీ మారుతున్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల… తన భర్త పార్టీ మారితే… నేను కూడా పార్టీ మారుతానని.. భర్తో పార్టీ.. భార్య ఒక పార్టీ ఉంటే బాగుండదు కదా అంటూ ఆమె పేర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో… వారు పార్టీ మారతారంటూ వార్తలకు మరింత బలం చేకూరుంది. ఈ నేపథ్యంలో… తాజాగా… సుచరిత భర్త దయాసాగర్ స్పందించారు.
తాను మారతారు అన్న ప్రచారంపై మాజీ మంత్రి సుచరిత భర్త దయ సాగర్ బహిరంగ లేఖ రాశారు. నేను కేంద్ర సర్వీసులో ఉన్నతాధికారిగా పని చేశానని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో అత్యంత అనుబంధం కలిగిన కుటుంబం మాదని అన్నారు. మాకు జగన్ కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని శంకించవద్దని పేర్కొన్న ఆయన నేను అక్కడి నుంచి పోటీ చేస్తాను ,ఇక్కడి నుంచి పోటీ చేస్తాను అని ఊహాగానాలు హల్చల్ చేస్తున్నాయని అన్నారు.
ఇక రిటైర్డ్ అయిన ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో చేరాల్సిన అవసరం లేదని పేర్కొన్న ఆయన నేను రాజకీయాలకు వస్తే అందరికీ చెప్పే వస్తానని అన్నారు. మా కుటుంబంలో పార్టీ మారతారు అనే ప్రశ్న ఉత్పన్నం అవడానికి ఆస్కారం లేదని పేర్కొన్న ఆయన నిరాధారమైన ఊహాగానాలకు స్పందించాల్సిన అవసరం మా కుటుంబానికి లేదని అన్నారు. అలాగే మా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించవద్దని అయన పేర్కొన్నారు.