W.G: భీమవరంలో సూపర్ జీఎస్టీ బెనిఫిట్ బజార్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నాగరాణి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 13 నుంచి 19 వరకు భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్ నందు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జీఎస్టీ తగ్గింపుల ప్రచారాన్ని 4 కేటగిరీలుగా విభజించి 3 వారాలపాటు వివిధ వస్తువుల ప్రదర్శనలతో అవగాహన కలిగించే విధంగా ప్రచారాన్ని పూర్తి చేశామన్నారు.