GNTR: వీఆర్ఏలకు పే స్కేల్ జీతాలు చెల్లించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో వీఆర్ఏలు శనివారం పెదకాకాని తహసీల్దార్ కృష్ణ కాంత్‌కు మెమోరాండం ఇచ్చారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి నన్నపనేని శివాజీ మాట్లాడుతూ.. వీఆర్ఏలకు గత 8 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వాలు జీతాలు పెంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు.