GNTR: ఈ నెల 13న అమరావతిలో ప్రారంభం కానున్న సీఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయాన్ని శనివారం మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ సందర్శించారు. ప్రాజెక్టు కార్యాలయ ప్రారంభోత్సవ సన్నాహక వివరాలను సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు కార్యదర్శికి వివరించారు. సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ ఏ. భార్గవ్ తేజ ప్రాజెక్టు కార్యాలయం నిర్మాణ పనులను పరిశీలించారు.