KNR: చిగురుమామిడి మండలం ఇందుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఓదెలు కుమార్‌కు టెక్ మహేంద్ర ఫౌండేషన్ సైన్స్ అకాడమీ అవార్డు లభించింది. 2021-22లో సైన్స్ ప్రయోగాల శిక్షణ తీసుకుని, విద్యార్థులు, ఉపాధ్యాయులకు సైన్స్ టెంపర్‌ను పెంపొందించినందుకు ఈ గౌరవం దక్కింది. జిల్లా విద్యాధికారి మొండయ్య అధికారులు, ఉపాధ్యాయులు ఆయనను అభినందించారు.