NLR: కలువాయి మండలం తోపు గుంట అగ్రహారానికి చెందిన వృద్ధ దంపతులు వింజం కొండయ్య, వింజం రత్నమ్మ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన శనివారం చోటు చేసుకున్నది. గ్రామానికి సమీపంలోని పొలంలో విష గుళికలు తిని మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.