BHNG: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగుల పరిస్థితి దినదిన గండం.. నూరేళ్ల ఆయుష్షులా ఉంది. తమకు వేతనం ఎప్పుడిస్తారో.. విధుల నుంచి ఎప్పుడు తొలగిస్తారోననే భయంతో వారు పనిచేస్తున్నారు. వారికి నచ్చితే ఒకలా.. నచ్చకుంటే మరోలా వ్యవహరిస్తూ విధుల నుంచి తొలగిస్తున్నారని కాంట్రాక్టు కింద పనిచేసే ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.