కోనసీమ: పి.గన్నవరం మండలం నరేంద్రపురం గ్రామానికి చెందిన మాజీ మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడు పిళ్లి శ్రీనివాసరావు అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ వారి గృహానికి చేరుకుని, శ్రీనివాసరావు పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, వారిని ఓదార్చారు.