టీడీపీ అధినేత సతీమణి నారా భువనేశ్వరికి రాష్ట్ర ఈసీ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ వైసీపీ నేతల ఫిర్యాదు మేరకు విచారణ జరపాలని ఈసీ ఆదేశించింది.
Nara Bhuvaneswari: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరికి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ వైసీపీ నేతల ఫిర్యాదు ఆధారంగా నోటీసులు అందించింది. స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు అయిన సందర్భంగా ఆయన అభిమానాలు మనస్తాపం చెంది మరణించారు. అదే సమయంలో నిజం గెలవాలి అనే కార్యక్రమం చేపట్టిన భువనేశ్వరి బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ క్రమంలో వారి కుటుంబాలకు అండగా భువనేశ్వరి చెక్కులు అందజేస్తున్నారు.
నారా భువనేశ్వరి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో చెక్కులు పంపిణీ చేశారని వైసీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ అంశంలో చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ క్రమంలో నారా భువనేశ్వరికి ఈసీ నోటీసులు ఇచ్చింది. ఈ ఘటనపై 24 గంటల్లో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ను ఈసీ ఆదేశించింది.