NTR: జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలు, ఈదురుగాలులతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మొక్కజొన్న, వరి, మిర్చి పంటలు దెబ్బతిన్నాయని వైసీపీ నేతలు తెలిపారు. నష్టపరిహారం అందించాలని తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. మొక్కజొన్నకు ఎకరాకు రూ.50వేలు, కనీస మద్దతు ధర రూ.2400కు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.