అన్నమయ్య: పుల్లంపేట మండలంలో అప్పు వివాదం ఉద్రిక్తతకు దారి తీసింది. టి.కమ్మపల్లి పంచాయతీ ఎగువరెడ్డిపల్లికి చెందిన శ్రీను వద్ద రంగంపల్లి గ్రామానికి చెందిన వెంకటయ్య 12 సంవత్సరాల క్రితం రూ.80 వేల అప్పు తీసుకున్నాడు. కొంత మొత్తం చెల్లించినప్పటికీ పూర్తి బాకీ తీర్చలేదని ఆరోపిస్తూ, శ్రీను జేసీబీతో వెంకటయ్యకు చెందిన పెంకుటిల్లును కూల్చివేసినట్లు స్థానికుల సమాచారం.