కోనసీమ: ప్రజలే నేరుగా వచ్చి తమ సమస్యలను విన్నవించుకోవడానికి అవకాశం కల్పిస్తున్న ప్రజాదర్బార్ నిజమైన ప్రజాస్వామ్యానికి నిదర్శనంగా నిలుస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. శుక్రవారం రావులపాలెం క్యాంపు కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజల నుంచి 99 వినతులను స్వీకరించారు.