CTR: కుప్పం (M) గుట్టపల్లి కాలనీ సమీపంలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న రెండు క్వారీలను సీజ్ చేసినట్లు DSP పార్థసారథి, అర్బన్ CI శంకరయ్య తెలిపారు. అక్రమ క్వారీల్లో రెండు హిటాచి వాహనాలతో పాటు ఓ గ్రానైట్ లారీని సీజ్ చేసి మైనింగ్ అధికారులకు అప్పగించినట్లు వారు తెలిపారు. సుమారు 26 గ్రానైట్ బ్లాక్లను సైతం సీజ్ చేశామన్నారు.