PPM: గిరిజనులు వ్యయ, ప్రయాసలుపడి ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తే సరైన వైద్యం అందట్లేదని CPM జిల్లా కమిటీ సభ్యులు సాంబమూర్తి ఆరోపించారు. ఆదివారం కొమరాడ PHC వద్ద ఆయన మాట్లాడుతూ.. సరైన వైద్యం అందక ప్రైవేట్ వైద్యులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. DHMO క్షేత్రస్థాయిలో పరిశీలించి అన్ని ఆరోగ్య కేంద్రాల్లో సరైన వైద్యం అందించాలన్నారు.