NLR: కావలి పట్టణం 10వ వార్డు మాలపాలెంలో శ్రీశ్రీశ్రీ కళుగోళమ్మ తల్లి దేవస్థానంలో నిర్వహించనున్న సంక్రాంతి సంబరాలు, గ్రామోత్సవానికి సంబంధించిన గోడపత్రికను కావలి MLA కావ్య కృష్ణా రెడ్డి TDP కార్యాలయంలో లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో గ్రామ ప్రజలంతా ఐక్యంగా పాల్గొనాలని ఆయన తెలిపారు. సంప్రదాయాలను కాపాడే ఇలాంటి ఉత్సవాలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని ఆకాంక్షించారు.