KRNL: ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి అన్ని కార్పొరేట్ సౌకర్యాలు కల్పించేందుకు అన్ని విధాల కృషి చేస్తున్నామని మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. మంగళవారం ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.6.74 కోట్ల విలువైన 128 స్లైస్ డబుల్ సీటీ స్కాన్ ప్రారంభించారు. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ CSR ఫండ్స్ ద్వారా ఏర్పాటు చేసిన ఈ మిషన్ ద్వారా రోగులకు వైద్య సేవలు లభిస్తాయని పేర్కొన్నారు.