కాకినాడ: సాధారణ తనిఖీలలో భాగంగా కాకినాడ నగరంలోని బస్టాండ్, రైల్వే స్టేషన్, పార్కుల లో గురువారం సాయంత్రం బాంబు స్క్వాడ్ బృందం గాలించారు. అణువణు పరిశీలించి ప్రజల్ని అప్రమత్తం చేశారు. ఈ తనిఖీలలో పోలీస్ సిబ్బంది రామకృష్ణ, మణికంఠ, డాగ్ హ్యాండ్లర్ శ్రీనివాస్, డాగ్ మ్యాక్స్, తదితరులు పాల్గొన్నారు.