VSP: పెందుర్తి ఏరియాలో జరుగుతున్న నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని క్రైమ్ సీఐ శ్రీనివాసరావు హెచ్చరించారు. పెందుర్తి సాయి ఐటీలో విద్యార్థులకు దొంగతనాలు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. ముఖ్యంగా గంజాయి మాదకద్రవ్యాలకు అలవాటు పడవద్దని అన్నారు. వీటికి అలవాటు పడితే భవిష్యత్తు అంధకారంగా మారుతుందన్నారు.