ATP: సర్వజన వైద్యశాలలో ఏర్పాటు చేసిన విభిన్న ప్రతిభావంతులకు క్యాలిపర్లు, కృత్రిమ కాళ్లు, పరికరాల తయారీ కేంద్రాన్ని రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల కార్పొరేషన్ ఛైర్మన్ నారాయణస్వామి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పలువురు దివ్యాంగులకు కృత్రిమ కాళ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఏడీ అర్చన పాల్గొన్నారు.