ATP: RDT పరిరక్షణ కోసం ఇవాళ అనంతపురం ప్రెస్ క్లబ్లో అఖిల పక్ష రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఉరవకొండ వైసీపీ ఇంఛార్జ్ విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. జిల్లా ప్రజలకు నిస్వార్థంగా సేవలు అందిస్తున్న సంస్థ ఆర్డీటీ అని తెలిపారు. RDTని కాపాడటం మనందరి బాధ్యత అని అన్నారు. FCRA రెన్యువల్ చేయాలని డిమాండ్ చేశారు.