PLD: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా ఎస్పీ బి. కృష్ణా రావు, ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. కుటుంబ, ఆర్థిక, ఆస్తి తగాదాలు, తదితర అంశాలకు సంబంధించి మొత్తం 111 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు.