E.G: ప్రముఖ పుణ్యక్షేత్రమైన దిగువ అహోబిలంలో గురువారం శ్రీ ప్రహ్లాద వరద, శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 46వ పీఠాధిపతి రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామి ఆధ్వర్యంలో, ప్రధాన అర్చకులు క్రీడాంభి వేణుగోపాల్ స్వామి పర్యవేక్షణలో హోమం, పూర్ణాహుతి నిర్వహించి, స్వామివారి గ్రామోత్సవం ఘనంగా జరిపారు.