ప్రకాశం: జిల్లా వైసీపీ టీచర్ల విభాగం అధ్యక్షునిగా పామూరుకు చెందిన కల్లూరి రామిరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధిష్ఠానం నుంచి ఆయనకు ఉత్తర్వులు అందాయి. తనను టీచర్ల విభాగం అధ్యక్షునిగా నియమించినందుకు వైసీపీ అధినేత జగన్కు, సహకరించిన కనిగిరి వైసీపీ ఇన్ఛార్జ్ నారాయణ యాదవ్కు రామిరెడ్డి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.