VSK: బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భీమిలి మూడో వార్డు ప్రభుత్వ ఆసుపత్రి రోడ్డులో సరిపల్లి అప్పారావు ఇంటి గోడ కూలిపోయింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. విషయం తెలిసిన ఎస్సై విజయ్, శానిటేషన్ అధికారి వరప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. జేసీబీ సహయంతో సహాయక చర్యలు చేపట్టారు.