ELR: చింతలపూడి మండలం పొనుకుమాడులో బెల్టు షాపులపై ఎక్సైజ్ అధికారులు ఆదివారం దాడులు నిర్వహించారు. ఈ దాడులలో గంగుల తిరుపతయ్య వద్ద ఆరు క్వార్టర్ మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ అశోక్ తెలిపారు. ఈ దాడులలో ఎస్సై జె. జగ్గారావుతో పాటు సిబ్బంది ఉన్నారు.