అన్నమయ్య: రాయచోటి పట్టణంలోని విద్యుత్ కార్యాలయంలో నూతన సర్కిల్ ఆఫీసును రాష్ట్ర రవాణా, యువజన క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో వోల్టేజ్ సమస్యలు, సిబ్బంది కొరతలు లేకుండా చర్యలు తీసుకుంటామని, నవంబర్ నుంచి ట్రూ అప్ ఛార్జీలను తగ్గించే ప్రణాళిక ప్రభుత్వం సిద్ధం చేసిందని తెలిపారు.