అనకాపల్లి: ఇటీవల అనకాపల్లి మండలం కొత్తూరులో వీఎంఆర్డీఏ పార్క్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అధికారులు ప్రోటోకాల్ పాటించలేదని ఎంపీపీ గొర్లి సూరిబాబు ఆదివారం ఓ ప్రకటనలో విమర్శించారు. ప్రోటోకాల్ ప్రకారం ప్రజా ప్రతినిధులను ఆహ్వానించకపోవడం సరికాదన్నారు. కనీసం కొత్తూరు గ్రామ సర్పంచ్ ప్రసన్నలక్ష్మికి కూడా ఆహ్వానం అందలేదన్నారు. శిలాఫలకంపై సర్పంచ్ పేరు వేయలేదన్నారు.