ప్రకాశం: అద్దంకి సమీపంలోని శింగరకొండలో ఉన్న కేఆర్కే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జవహర్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన జాబ్ మేళాలలో వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు 59 మంది ఎంపిక అయినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ వి.మోహనరావు తెలిపారు. మొత్తం 116 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా, 104 మంది హాజరయ్యారు. మేళాలో పలు కంపెనీలకు 59 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు.