AKP: అచ్యుతాపురం మండలం చీమలాపల్లిలో శుక్రవారం మహిళలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. క్యాన్సర్, కిడ్నీ, లివర్ తదితర వ్యాధులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి గర్భిణీలు బాలింతలకు పౌష్టికాహారాన్ని అందజేశారు. పంపిణీ చేస్తున్న పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని అంగన్వాడీ కార్యకర్తలు కోరారు.