విజయనగరంలో మే 1న లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ప్రకాశం పార్క్ వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నట్లు AIFTU జిల్లా నాయకుడు రెడ్డి నారాయణరావు తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం గోడపత్రికను విడుదల చేశారు. పాత కార్మిక చట్టాలను రద్దు చేసి కొత్త లేబర్ కోడ్లు అమలు చేయడం కార్మికులకు అన్యాయం అని విమర్శించారు. కార్మికులు ఐక్యంగా ఈ కోడ్లను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.