»Daggubati Purandeswari All The Owners Of Liquor Companies In Ap Are Ysrcp
Daggubati Purandeswari: ఏపీలో మద్యం కంపెనీల ఓనర్లంతా వైసీపీ వాళ్లే..ధైర్యముంటే పేర్లు బయట పెట్టండి
ఏపీలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల నేతలు విమర్శల దాడులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఏపీ బీజేపీ అధినేత్రి దగ్గుబాటి పురంధేశ్వరి అధికార పార్టీ నేతలకు అదిరిపోయే సవాల్ చేసింది. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
Daggubati Purandeswari All the owners of liquor companies in AP are ysrcp
ఏపీ బీజేపీ అధినేత్రి దగ్గుబాటి పురంధేశ్వరి(Daggubati Purandeswari)వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న మద్యం కంపెనీలన్నీ వైసీపీ వారివేనని పురంధేశ్వరి ఆరోపించారు. ఈ క్రమంలో మీకు దమ్ము, ధైర్యం ఉంటే రాష్ట్రంలో తయారు చేస్తున్న మద్యం కంపెనీల యజమానుల పేర్లు బయట పేట్టాలని డిమాండ్ చేశారు. ప్రజాక్షేత్రంలో వారి పేర్లు చెప్పే ధైర్యం మీకు ఉందా అంటూ నిలదీశారు. ఈ నేపథ్యంలో మీకు నిజంగా ధైర్యం ఉంటే సాయంత్రం వరకు పేర్లు చెప్పాలని అన్నారు.
అయితే ఇప్పటికే రాష్ట్రంలో మద్యం తయారు చేసినా, అమ్మినా కూడా ఏడేళ్లు జైలు శిక్ష విధిస్తామని చెప్పిన జగన్(jagan) వ్యాఖ్యలను మరోసారి పురంధేశ్వరి గుర్తు చేశారు. మాయమాటలు చెబుతూ జగన్ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. అసలు మద్యం షాపుల్లో ఆన్ లైన్ పేమెంట్స్ ఎందుకు స్వీకరించడం లేదని ప్రశ్నించారు. ఆన్ లైన్ విధానంలో కాకుండా వచ్చే డబ్బు మొత్తం తాడేపల్లికి తరలించేందుకే ఇలా చేస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాదు నాసిరకం మద్యం సేవించి మరణించిన వారి పేర్లు కూడా బయటపెట్టాలని డిమాండ్ చేశారు. వారి కుటుంబాలకు ఎవరు న్యాయం చేస్తారని వైసీపీ(YCP) నేతలను ప్రశ్నించారు. విజయవాడ బీజేపీ కార్యాలయంలో మాట్లాడిన క్రమంలో ఈ మేరకు పేర్కొన్నారు.