ప్రకాశం: వెలిగొండ ప్రాజెక్ట్ పనుల పరిశీలనకు మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు దోర్నాలకు రానున్నారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. శుక్రవారం ఉదయం కొత్తూరు వద్ద టన్నెళ్లను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఇటీవల రెండు సార్లు సందర్శించిన మంత్రి, పనులు వేగంగా పూర్తి చేయాలని ఇప్పటికే దిశానిర్దేశం చేశారు.