గుంటూరు: పట్టణం నల్లచెరువు ఏరియాలో ఇవాళ సాయంత్రం సుమారు 32 సంవత్సరాల వయసు కలిగిన గుర్తుతెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. దీనిని గమనించిన స్థానికులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి (జీజీహెచ్)లో చేర్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ వ్యక్తి మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.