BPT: విధుల పట్ల నిర్లిప్తంగా వ్యవహరించిన చీరాల రెవిన్యూ ఇన్స్పెక్టర్, ఇద్దరు వీఆర్వోలను బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి సస్పెండ్ చేశారు. ఈ మేరకు బాపట్ల కలెక్టరేట్లో సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. చీరాల మండలం ఆర్ఐ నాగ కుమార్, చీరాల మండలం తోటవారిపాలెం వీఆర్వో ఎస్ శివరామిరెడ్డి, బోయినవారిపాలెం వీఆర్వో పి.తులసీరావు సస్పెండ్‌కు గురయ్యారు.