VZM: జిల్లాకు నూతనంగా రెండోసారి టీడీపీ అధ్యక్ష స్థానానికి ఎన్నికైన కిమిడి నాగార్జున, మొదటిసారి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన వరప్రసాద్ గురువారం మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ను తన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి వారికి శుభాకాంక్షలు తెలిపి శాలువాలతో సత్కరించారు. పార్టీని అభివృద్ధి పథంలో నడిపించాలని వారికి సూచించారు.