కర్నూలు: విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ ఛైర్మన్ మహమ్మద్ ఫారుఖ్ షుబ్లీని ఆదోని జిల్లా సాధన జేఏసీ కన్వీనర్ నూర్ ఆమ్మద్ కలిశారు. ఆదోని జిల్లా ఆకాంక్ష ప్రజల అవసరాలు, ప్రజాస్వామ్యబద్ధంగా సాగుతున్న ఉద్యమ వివరాలను ఆయనకు ఇవాళ వివరించారు. అంశాన్ని శ్రద్ధగా విన్న షుబ్లీ ప్రభుత్వంతో చర్చిస్తాన్నారు. ఆదోని ముస్లిం మత పెద్దలు షుబ్లీని సన్మానించి మొమెంటో అందజేశారు.