అన్నమయ్య: రైల్వేకోడూరు మండలం వెంకటేశ్వరపురం సమీపంలో రైల్వే ట్రాక్ దగ్గర పొలాల్లో సోమవారం ఓ వృద్ధురాలు అపస్మారక స్థితిలో కనిపించారు. ఈ మేరకు స్థానికులు గమనించి 108కు సమాచారం అందించడంతో, అంబులెన్స్ సిబ్బంది వెంటనే స్పందించి ఆమెను రైల్వే కోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆమె ఆచూకీ తెలిసిన వారు తక్షణమే ఆసుపత్రిని సంప్రదించాలని సిబ్బంది కోరారు.