GNTR: హౌసింగ్ లోన్లకు అవసరమైన పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వడంలో అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని ప్రత్తిపాడు MLA బూర్ల రామాంజనేయులు అసెంబ్లీలో అన్నారు. హౌసింగ్, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని ఆయన పేర్కొన్నారు. అంతే కాకుండా, గత ప్రభుత్వ హయాంలో నగరవాసులకు రూరల్ ప్రాంతాల్లో ఇచ్చిన ఇళ్ల స్థలాలు నిరుపయోగంగా ఉన్నాయన్నారు.