KKD: తుని పట్టణంలో శుక్రవారం ఎమ్మెల్యే యనమల దివ్య ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ జరిగింది. 11 నుంచి 15 వార్డులకు సంబంధించిన ప్రజలు తమ వినతులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వివిధ సమస్యలపై తమ గోడును తెలియజేశారు. ప్రజాదర్బార్‌కు మొత్తం 283 వినతులు రాగా 180 వినతులను అక్కడికక్కడే పరిష్కరించినట్లు ఎమ్మెల్యే దివ్య చెప్పారు.