సత్యసాయి: మొంథా తుఫాను కారణంగా వర్షాలు మొదలయ్యాయని, హిందూపురం నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైసీపీ ఇంఛార్జ్ టీఎన్ దీపిక తెలిపారు. రైతులు పంట ధాన్యాన్ని సురక్షితంగా భద్రపరచాలని, నదీ పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గొర్రెల కాపర్లు, పశువుల కాపరులు పశువులను ఇంటి వద్దే మేపాలని ఆమె కోరారు.