WG: ఈ నెల 29వ తేదీన భీమవరం ఎస్ఆర్కేఆర్ కళాశాలలో ఏబీవీపీ ఆధ్వర్యంలో జరిగే ఉగాది వేడుకల బ్రోచర్‌ను రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉగాది అందరూ చేసుకునే పండుగ అని, శ్రీవిశ్వావసు నామ సంవత్సరం అందరికీ శుభప్రదంగా ఉండాలన్నారు.