ప్రకాశం: చంద్రశేఖరపురం మండలం చిన్నపనాయనపల్లిలో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాల గురువారం మండల అధ్యక్షులు నరసయ్య స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ నిర్వహించారు. టీడీపీ మండల అధ్యక్షులు ఇంటింటికి వెళ్లి స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ మేరకు నిత్యవసర సరుకుల పంపిణీలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం స్మార్ట్ కార్డులను అందజేసింది అన్నారు.