టీమిండియా యువ క్రికెటర్ కోన శ్రీకర్ భరత్ (Shrikar Bharat) సీఎం జగన్‌ని తాడేపల్లి సీఎం క్యాంప్‌లో మర్యాదపూర్వకంగా కలిసారు. ఇండియా క్రికెట్‌కు ప్రాతినిధ్యం వహించినందుకు గాను సీఎం జగన్ (CM Jagan) భరత్‌ను అభినందించారు.టీమిండియా క్రికెటర్లు ఆటోగ్రాఫ్‌లు చేసిన జెర్సీని సీఎంకు బహుకరించారు. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత ఏపీ నుంచి టీమిండియా(Team India)కు ప్రాతినిధ్యం వహించిన మొదటి క్రికెటర్‌ను నేనే కావడం చాలా గర్వంగా ఉందని అన్నాడు. ఈ విషయాన్ని సీఎంతో షేర్ చేసుకోగా, ఆనందం వ్యక్తం చేశారని తెలిపాడు.
తన లాంటి ఎంతో మంది యువ క్రికెటర్లకు సీఎం జగన్ స్పూర్తిగా నిలుస్తారని భరత్ తెలిపాడు. దేశం గర్వపడేలా, మన రాష్ట్ర పేరు ప్రతిష్టలు నిలబెట్టాలని సీఎం సూచించారని తెలిపాడు. క్రీడాకారులకు ఏపీ ప్రభుత్వం (AP Govt) ఇస్తున్న ప్రోత్సాహం చాలా బాగుందని, ఇలాంటి ప్రోత్సాహం లభించడం వల్ల నాలాంటి చాలామంది క్రీడాకారులు (Sportsmen)వెలుగులోకి వస్తారని చెప్పుకొచ్చాడు. కాగా, సీఎం జగన్‌తో జరిగిన సమావేశంలో కేఎస్ భరత్‌తో పాటు అతని తల్లిదండ్రులు మంగాదేవి, శ్రీనివాసరావు, కోచ్ క్రిష్ణారావు, ఎంపీ మిథున్ రెడ్డి పాల్గొన్నారు.